చిత్తూరు జిల్లాలో 33 మంది వలంటీర్లను అధికారులు తొలగించారు. చిత్తూరు కార్పొరేషన్లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండలంలో ముగ్గురిని అధికారులు తొలగించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్పగించిన పనులు సక్రమంగా చేయలేదన్న కారణంతో వలంటీర్లను తొలగించినట్లు అధికారులు చెప్పుకుంటున్నారు. ఎన్నిక సమయంలో వలంటీర్ల తొలగింపు వివాదాస్పదంగా మారింది.