అప్పులు తేవడానికి చివరకు కలెక్టర్ కార్యాలయాలు కూడా తాకట్టు పెట్టే స్థితికి దిగజారారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అయన మాట్లాడుతూ.... రాబోయే పాతికేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి నడుపుతున్నారు. ఈ రాష్ట్రం మరింత పతనం కాకుండా కాపాడుకోవాలి. రాబోయే ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర భవిష్యత్‌ను సమూలంగా మారుస్తుంది. మూడు పార్టీల జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ మా అందరి జెండా... ఎజెండా. ప్రపంచ వేదికపై మన దేశాన్ని నంబర్ వన్‌గా నిలిపే శక్తి మోదీకి ఉంది. భారత్‌ను పేదరికం లేని, ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా నిలపడానికి ఆయన తపిస్తున్నారు అని అన్నారు.