జగన్ బీసీలకు 70 సీట్లు ఇచ్చేశామని చెబుతున్నారు. ఐదేళ్లలో ఏ ఒక్క బీసీ కులానికైనా న్యాయం చేసింది ఉందా? ఏవో కొంత మందికి సీట్లు ఇచ్చేస్తే అది సామాజిక న్యాయం అవుతుందా? ఐదేళ్లలో బీసీ సంక్షేమాన్ని జగన్ నాశనం చేశారు. బీసీ విద్యార్థులు చదువుకునే స్టడీ సెంటర్లను కూడా మూసివేశారు. విదేశీ విద్య పక్కన పెట్టారు. ప్రతివారికి కూడా నేను నొక్కాను.. నొక్కాను అంటూ చెబుతున్నారు. బీసీలకు న్యాయం చేశాను, ప్రజలంతా నా పక్కనే ఉన్నారన్న మాయమాటలను బీసీ సోదరులు నమ్మొద్దు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే పవన్ పొత్తులు పెట్టుకున్నారు అని జనసేన పార్టీ నాయకుడు, గాదె వెంకటేశ్వర్లు తెలిపారు.