అక్కడ కేంద్రంలో మోదీ.. ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ఐదేళ్లలో కార్యకర్తలను వేధించినవారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. అది అధికారులైనా, అధికార పార్టీలోవారైనా వదిలే ప్రసక్తే లేదు. ల్యాండ్, శాండ్, మైనింగ్ ఏదీ వదలకుండా దోపిడీ చేశారు. కక్షగట్టి కార్యకర్తలను వేధించారు. అవినీతి, వేధింపులకు పాల్పడిన వారినీ వదిలేది లేదు అని బీజేపీ నాయకుడు, సీఎం రమేశ్అన్నారు.