ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NDA కూటమి గెలుపు ఖాయమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నిర్వహించిన కూటమి సభ విజయవంతమైందన్నారు.
వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలనేదే ప్రధాని మోదీ కల అని కొనియాడారు. ఏపీలోని ప్రతి శాఖలో అవినీతి ఉందని దుయ్యబట్టారు. ధర్మ పోరాటంలో రాష్ట్రం కోసం ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు.