పోలవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెల్లం రాజ్యలక్ష్మి కులంపై స్పందనలో ఫిర్యాదు చేసిన మడకం వెంకటేశ్వరావు నుంచి శనివారం తహసీ ల్దార్ వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. రాజ్య లక్ష్మి ఎస్టీ కాదని వెంకటేశ్వరావు కలెక్టరేట్లో నిర్వహించే స్పందనలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయా ల్సిందిగా బుట్టాయగూడెం తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించ డంతో శనివారం ఫిర్యాదుదారుడి నుంచి స్టేట్మెంట్ను తీసుకోగా వెంకటేశ్వరరావు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఫీసా గ్రామసభలు ఏర్పాటు చేసి విచారణ జరిపి వాస్తవాలను బయటకుతీయాలని తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట ఆదివాసీ సేన ఆధ్వర్యంలో ధర్నా చేసి స్టేట్మెంట్ కాపీల ను తహసీల్దార్‌కు అంద శారు. రాజ్యలక్ష్మి మాత్రం తాను ఎస్టీ కోయ కులానికి చెందుతానని, తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేన న్నారు. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.