స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 736 పాయింట్లు నష్టపోయి 72,012 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 238 పాయింట్లు నష్టపోయి 21,817 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : బజాజ్ ఫైనాన్స్ (1.38%), కోటక్ బ్యాంక్ (0.57%), ఐసిఐసిఐ బ్యాంక్ (0.26%), భారతీ ఎయిర్‌టెల్ (0.23%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (0.19%).
టాప్ లూజర్స్ : టీసీఎస్ (-4.03%), నెస్లే ఇండియా (-3.37%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.15%), విప్రో (-3.05%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.62%).