వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌పై టీడీపీ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ పోస్టును పరిశీలించామని.. అందులో కొంత భాగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉంది అన్నారు. ఆ భాగాన్ని 24 గంటల్లో తొలగించాలని ఎన్నికల సంఘం సూచించింది.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పోస్ట్ పెట్టిందని.. టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఎక్స్(ట్విటర్), ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారం చేస్తున్నారంటూ తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. అచ్చెన్నాయుడికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై టీడీపీ స్పందించాల్సి ఉంది.