రాయదుర్గం పట్టణం శాంతినగర్ వద్ద ఓ ఇంటిలో ప్లాస్టిక్ బాటిల్ తయారు చేస్తున్న ప్లాంటును సీజ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కిషోర్ మీడియాకి బుధవారం తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్లాంట్ నిర్వహిస్తున్న యజమానిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుమతులు లేకుండా వాటర్ ప్లాంట్ లను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.