ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని పవన్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
ఇకపై తాను పిఠాపురంలోనే ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానన్న పవన్.. ఇక్కడి నుంచి ఏపీ భవిష్యత్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.