అత్యంత కాలుష్య పూరిత దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2023 సంవత్సరానికిగానూ 134 దేశాల్లోని ప్రపంచ గాలి నాణ్యత నివేదికను స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ విడుదల చేసింది.
కాలుష్య భరిత దేశాల్లో మొదటి స్థానంలో బంగ్లాదేశ్, రెండోస్థానంలో పాకిస్థాన్ నిలిచాయి. ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఐస్‌లాండ్, న్యూజిలాండ్, మారిషస్, ఎస్టోనియా, గ్రెనెడా దేశాలు క్లీన్ కంట్రీలుగా ఉన్నాయి.