ప్రజల ఆహార అభిరుచుల్లోనూ మార్పులు వస్తున్నాయి. గత పదిహేనేళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81 శాతం పెరిగిందని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ICAR) వంటి ప్రభుత్వ విభాగాలతో కలిసి వరల్డ్ ఫిష్,
ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (IFPRI) అధ్యయనంలో తేలింది. దీని ప్రకారం.. త్రిపురలో అత్యధిక చేపల వినియోగదారులు (99.35%) ఉండగా, హర్యానాలో అత్యల్పంగా (20.55%) ఉన్నారు.