అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ దూసుకుపోతున్నారు. తాజాగా ఇల్లినాయీస్, ఒహైయో,
కాన్సాస్ రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ విజయం సాధించారు. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ మధ్య పోరు దాదాపు ఖాయమైంది.