ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండల విద్యాధికారులకు నెలకు రూ. వెయ్యి చొప్పున స్థిర రవాణా భత్యాన్ని ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే ఎంఈఓ-1కు ఈ సదుపాయం ఉండగా.. మండల విద్యాధికారులకు భత్యాన్ని ఇస్తూ ఆదేశాలిచ్చింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడానికి మండలాల్లో ఇద్దరు ఎంఈఓలు ఉండే విధంగా విద్యాశాఖ కార్యాచరణ చేపట్టింది.