ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌గాంధీకి టికెట్ ఇవ్వకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన స్నేహితుడు వరుణ్ గాంధీకి టిక్కెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. యూపీలోని పిలిభిత్ స్థానానికి SP-కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇక్కడి నుంచి సమాజ్‌వాదీ పార్టీ వరుణ్ని బరిలోకి దింపవచ్చనే ప్రచారం జరుగుతోంది.