తిరుపతి రుయా ఆస్పత్రి ఆవరణలో ఉన్న సీఐటీయూ ఆఫీస్లో మద్యం సేవిస్తూ ఉద్యోగులు పట్టుబడ్డారు. రోగుల వార్డులలో నీరు రావడం లేదని ఏఆర్ఏంఓ హరికృష్ణ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వాటర్ మ్యాన్ సుబ్రహ్మణ్యం అందుబాటులో లేకపోవడంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. సీఐటీయూ కార్యాలయంలో మద్యం సేవిస్తూ సుబ్రహ్మణ్యం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. కార్మికుల సంక్షోభం కోసం ఇచ్చిన సీఐటీయూ ఆపీసును బార్గా మార్చిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా.. సుబ్రహ్మణ్యం మద్యం సేవిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే వైసీపీ నేతల ఒత్తిడితోనే వాటర్ మ్యాన్పై రుయా అధికారులు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.