చీపురుపల్లిలో మంగళవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. మూడు గంటలకు ప్రారంభమైన వర్షం సాయంత్రం నాలుగున్నర వరకూ ఏకధాటిగా కురిసింది. వడగళ్లతో కూడిన వర్షంతో పాటు ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కనకమహాలక్ష్మి జాతరలో ఆకర్షణ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ సెట్టు రోడ్డుకు అడ్డంగా నేలకొరిగింది.