శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన పిరియా విజయ రైతు కుటుంబానికి చెందిన మహిళ. బీఏ చదువుకున్న ఆమె వైయస్ఆర్సీపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చూపుతున్న చిత్తశుద్ధిని గమనించిన సీఎం జగన్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో శ్రీకాకుళం జడ్పీ ఛైర్పర్సన్గా చేశారు. ఆ పదవిలో రాణిస్తున్న విజయను ఇప్పుడు ఇచ్ఛాపురం నియోజకవర్గ వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.