కర్నూలు నగరానికి చెందిన బీవై రామయ్య బీసీ వర్గంలో బోయ సామాజిక వర్గానికి చెందిన రైతు బిడ్డ. వైయస్ఆర్సీపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీవై రామయ్యకు ఉన్న చిత్తశుద్ధిని పసిగట్టిన సీఎం వైయస్ జగన్.. మొన్న కర్నూలు నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన బీవై రామయ్యను కర్నూలు నగరానికి మేయర్‌గా చేశారు. మేయర్‌గా రాణిస్తూ అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటుండటంతో కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేశారు.