నరసాపురం లోక్సభ స్థానం నుంచి కోటీశ్వరులను రాజకీయ పార్టీలు బరిలోకి దించడం రివాజు. ఆ లోక్సభ స్థానం అభ్యర్థిగా గూడురి ఉమాబాలను సీఎం వైయస్ జగన్ ప్రకటించగానే రాష్ట్రం యావత్తు ఆశ్చర్యపోయింది. బీసీ వర్గంలోని శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం నుంచి వచ్చిన న్యాయవాది ఉమాబాల. వైయస్ఆర్సీపీలో సాధారణ కార్యకర్తగా చేరిన ఆమె ప్రజా సమస్యల పరిష్కారంలో దూసుకుపోతూ అంచలంచెలుగా ఎదిగారు. జనబలమే గీటురాయిగా ఉమాబాలను నరసాపురం లోక్సభ అభ్యర్థిగా సీఎం వైయస్ జగన్ ఎంపిక చేశారు. ఆ స్థానం నుంచి బరిలోకి దించేందుకు వేల కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు.