నారాయణ విద్యా సంస్థల ద్వారా విద్యా వ్యాపారం చేస్తూ.. 2014–19 మధ్య రాజధాని భూ కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం, పట్టణ పేదలకు పక్కా గృహాలు ఇచ్చే పేరుతో టిడ్కో ఇళ్ల కుంభకోణానికి పాల్పడిన మాజీ మంత్రి నారాయణ రూ.వేలాది కోట్లకు పడగలెత్తారు. రూ.900 కోట్లకుపైగా పార్టీ ఫండ్ ఇచ్చిన నారాయణను నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బరిలోకి దించితే.. వైయస్ఆర్‌సీపీలో సాధారణ కార్యకర్త ఖలీల్ అహ్మద్‌ను సీఎం వైయస్ జగన్ పోటీకి పెట్టారు. మైనార్టీ కుటుంబానికి చెందిన ఖలీల్ అహ్మద్ బంగారు అభరణాల తయారీ పని చేస్తూ.. వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూనే పేదల సమస్యలపై పోరాటం చేశారు. అదే మొన్న నెల్లూరు నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఇచ్చేందుకు దోహదపడింది. కార్పొరేటర్‌గా ఎన్నికైన ఖలీల్ అహ్మద్‌ను సీఎం వైయస్ జగన్.. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా చేశారు. సమస్యల పరిష్కారంలో డిప్యూటీ మేయర్‌గా ఖలీల్ అహ్మద్ పనితీరుపై అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తుండటంతో ఆయనకు నెల్లూరు సిటీ నియోజవర్గం నుంచి సీఎం వైయస్ జగన్ టికెట్ ఇచ్చారు.