శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం ఫళారం గ్రామానికి చెందిన ఈర లక్కప్ప బీఏ వరకు చదువుకున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ఇతను అవివాహితుడు. ప్రభుత్వం ఇచ్చిన రెండు గదుల ఇంట్లో తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తూ వచ్చే కూలీతో తన తల్లి కడుపు నింపుతున్న ఈర లక్కప్ప.. మండల కేంద్రం గుడిబండకు వివిధ సమస్యలపై వచ్చే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద అర్జీలు రాసి ఇస్తూ.. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. వైయస్ఆర్సీపీలో 2015లో చేరిన ఇతని సేవా భావాన్ని గమనించిన సీఎం వైయస్ జగన్.. మడకశిర నియోజకవర్గం అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఉపాధి హామీ కూలీని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించుతూ సీఎం వైయస్ జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.