ధర్మవరంలోని లక్ష్మీ చెన్నకేశవ పురం వైఎస్సార్ కూడలి వద్ద ఉన్న ప్రధాన రహదారిపై ఈనెల 17న వైసీపీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించడంపై ధర్మవరం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది. మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశారు. వైసీపీ నాయకుడు గుర్రం శ్రీనివాసరెడ్డితో పాటు మరి కొందరిపై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.