దేశవ్యాప్తంగా తప్పుడు ప్రూఫ్‌లతో సుమారు 21 లక్షల సిమ్‌కార్డులు జారీ అయినట్లు గుర్తించామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది.
ఈ మేరకు ఎయిర్‌టెల్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, జియో, వొడాఫోన్ సంస్థలకు అలర్ట్ జారీచేసినట్లు వెల్లడించింది. కొన్ని అనుమానాస్పద నంబర్ల జాబితాను విడుదల చేసి వాటి పత్రాలను తక్షణమే రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించినట్లు చెబుతోంది. అవి బోగస్ ప్రూఫ్‌లని తేలితే సిమ్‌లను రద్దుచేయాలని పేర్కొంది.