టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‌ను పోలీసులు ఉండవల్లి కరకట్ట వద్ద అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని చెప్పడంతో ఆయన సహకరించారు.
కార్లు అన్నింటినీ తనిఖీ చేసి కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తుండగా ఈ తనిఖీలు జరిగాయి.