ఒడిశాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు వివిధ పదవులకు రాజీనామా చేశారు.
ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్‌కు అందజేశారు. ఎమ్మెల్యే పాణిగ్రాహి గత 25 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన త్వరలోనే బీజేడీలో చేరనున్నారని విశ్వసనీయ సమాచారం.