తమిళనాడులో మహిళలకు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ గుడ్ న్యూస్ అందించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని మేనిఫెస్టోలో బుధవారం ప్రకటించారు.
తమిళనాడుకు నీట్ నుండి మినహాయింపు ఇస్తామన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయబోమని, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా వచ్చేలా పోరాడుతామని చెప్పారు. రాష్ట్రంలో టోల్ బూత్‌లను పూర్తిగా రద్దు చేస్తామని హామీనిచ్చారు. కులగణన చేపడతామన్నారు.