హిందూపురం మండలం గోల్లాపురం పారిశ్రామికవాడలోని ఏపీఐఐసీకి చెందినటువంటి భూమిలో రాత్రిపూట కొంతమంది స్వార్థపరులు జెసిబి ట్రా క్టర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మట్టిని కర్ణాటక పారిశ్రామికవాడలో చేపడుతున్న రోడ్ల నిర్మాణానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, మంగళవారం రాత్రి కొంతమంది అడ్డుకోవడంతో వారు పరార్ అయ్యారని, వీటిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.