ఒంగోలు శివాలయం సెంటర్ లోని ఒక హోటల్, ఒక ఫ్రూట్ స్టాల్ లో వినియోగిస్తున్న 8 డొమెస్టిక్ సిలిండర్లను పౌరసరఫరాల శాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. డీఎస్ఓ ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో ఆ శాఖ ఉద్యోగులు దాడులు చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై 6-ఏ కేసులను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.