ప్రతి పోలింగ్ బూత్ లో ఆధిక్యత వచ్చేలా చూడాలని ఒంగోలు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ తెలిపారు. నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఓటు అత్యంత విలువైందని తెలిపారు. పోల్ మేనేజ్ మెంట్ లో ప్రతి నాయకుడు పూర్తి సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు పాల్గొన్నారు.