జనసేన అధినేత పవన్ను ఓడించడమే లక్ష్యంగా పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి పిఠాపురం ఎన్నికల బాధ్యతలు అప్పగించనుంది.
ఎన్నికలపై చర్చించేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ముద్రగడ, వంగా గీత బుధవారం బయల్దేరారు. మధ్యాహ్నం సీఎం జగన్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గ నేతలు వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు నేతలకు సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.