చంద్రబాబు ఓ ఊసరవెల్లి అంటూ వైయస్ఆర్సీపీ నాయకుడు, విజయవాడ ఎంపీ కేశినాని నాని విమర్శించారు. ఒంటరిగా గెలిచే సత్తా లేక ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. బుధవారం కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.... దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం ముందుంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ విఫలమయ్యారు. తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో దేవినేని అవినాష్ తన దైన ముద్ర వేసుకున్నారు. మంచి వాడిగా ముసుగు వేసుకున్న అసమర్థుడు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మోదీ భజన చేసేందుకు టీడీపీ జనసేన నేతలు సిద్ధమయ్యారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దలకు చంద్రబాబు తాకట్టు పెట్టాడు . పిఠాపురంలో ఓడిపోవటాని పవన్ సిద్ధమయ్యాడు. ఓటమి భయంతోనే పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు ,పవన్‌కు ప్రజాగళం సభలో మోదీని శాలువా తో సత్కరించడం చేతకాలేదు. 2024 ఎన్నికల తరువాత టీడీపీ జనసేన పార్టీలు బీజేపీలో విలీనం అయిపోతాయి. లోకేష్ కనులన్నల్లోనే టీడీపీ సోషల్ మీడియా నడుస్తోంది అని అన్నారు.