రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సమన్వయంతో పనిచేసి, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదామని వైయస్ఆర్సీపీ సర్వేపల్లి అభ్యర్థి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పేదల ప్రయోజనాలే లక్ష్యంగా కృషి చేశారన్నారు. ఆ పాలనా తీరు పార్టీలోని నాయకులు, కార్యకర్తలకు ప్రజల్లో గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండాను ఎగురవేసి హ్యాట్రిక్ సాధిద్దామని మంత్రి విజ్ఞప్తి చేశారు.