ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుదిదశలో వైసీపీ మేనిఫెస్టో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2024, 03:46 PM

సార్వత్రిక ఎన్నికలకు శ్రేణులను ‘సిద్ధం’ సభలతో సన్నద్ధం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ అ­ధ్య­­క్షుడు, సీఎం వైయ‌స్ జగన్‌ మేనిఫెస్టో రూపకల్పనపై చే­స్తు­­న్న కసరత్తు తుదిదశకు చేరుకుందని పార్టీ వర్గా­లు తెలిపాయి. 4 లోక్‌సభ స్థానాల పరిధిలో ఇ­ప్ప­­టికే సిద్ధం సభలు నిర్వహించిన నేపథ్యంలో మిగతా 21 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ప్రజలతో మ­మే­కమవుతూ పార్టీ శ్రేణులను, అభిమానులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు ఈనెల 27న ఇడుపు­ల­పాయ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్ని­క­ల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్‌ మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం చె­ప్పా­రు. చె­ప్పిన వాటితోపాటు ఇవ్వని హామీలను సై­తం అమ­లు చేయడంతో జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగింది. భీ­మిలి, దెందులూ­రు, రాప్తాడు, మేదరమెట్లలో ని­ర్వ­హించి­న సిద్ధం స­భ­లతో ఇది ప్రస్ఫుటితమైంది. బ­స్సు యా­త్ర ప్రా­రంభమయ్యేలోగా మేని­ఫెస్టో­ను ప్రకటించనుండటంతో జగన్‌ చెప్పాడం­టే చే­స్తాడంతే అన్న నమ్మ­కం ప్రజల హృదయాల్లో నాటుకుపోయింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa