బీరువాలో భద్రపరిచిన నగలు, నగదు చోరీ అయ్యాయని ఇంటి యజమానురాలు ఇచ్చిన ఫిర్యాదుపై బుధవారం కేసు నమోదు చేశామని పెడన ఎస్‌ఐ సూర్యశ్రీనివాస్ తెలిపారు. 4వ వార్డులో నివాసం ఉంటున్న రజియాసుల్తానా తన ఇంట్లోని బీరువాలో రూ.6 లక్షల విలువైన బంగారు నగలు, రూ. 10వేల ఉంచానని ఫిర్యాదులో పేర్కొ న్నారు. ఐదు రోజుల క్రితం ఆమె బీరువాను తెరిచి చూడగా నగలు, నగదు బీరువాలోనే ఉన్నాయి. మంగళవారం రాత్రి ఆమె మరోసారి బీరువా తెరిచి చూడగా బీరువాలో ఉండాల్సిన నగలు, నగదు కనిపించలేదు. రజియా సుల్తానా పోలీసులకు ఫిర్యాదు చేశారని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa