రెడ్ బుక్ పేరుతో నారా లోకేశ్ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరపాలని ఏసీబీ కోర్టు సీఐడీకి సూచనలు చేసింది.
దాంతో లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ, లోకేశ్ నిబంధనలు ఉల్లంఘించారని, అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన కోర్టు వచ్చే నెల 15కు విచారణ వాయిదా వేసింది.