దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)లో పని చేసే కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏప్రిల్ 1 నుంచి కూలీలకు ఇచ్చే జీతాలు పెంచనున్నట్లు వెల్లడించింది.
కేంద్ర నిర్ణయానికి ఎన్నికల సంఘం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎప్పటికప్పుడు జరిగేదే అని, కొత్తగా అమలు చేస్తున్న నిర్ణయం కాదని కేంద్రం పేర్కొంది. కేంద్రం వాదనతో ఎన్నికల సంఘం ఏకీభవించింది.