ఎన్నికల నియమావళిలో అమలులో భాగంగా ఆయా విభాగాలకు సంబందించి అధికార బృందాలు గుర్తించిన ప్రతి అంశాన్ని రోజూ విధిగా, వివరంగా నమోదు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టరు, ఆర్వో కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ గదిని తనిఖీ చేశారు. అక్కడ సిబ్బంది నమోదు చేసిన వివరాలను నిశితంగా పరిశీలించారు.