హిందూపురం జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌గా చిన్నపిల్లల వైద్యుడు డా. లింగన్నను నియమిస్తూ గురువారం డీసీ హెచ్ఎస్ పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. లింగన్న ప్రస్తుతం హిందూపురం ఆసుపత్రిలో సివిల్‌సర్జన్, చిన్నపిల్లల వైద్యుడిగా కొనసాగుతున్నారు. సీనియార్టీలో ఇతను మొదటి స్థానంలో ఉండటంతో నియమించారు. ఇప్పటి వరకు సూపరింటెండెంట్‌గా కొనసాగిన రోహిల్‌కుమార్ ఫొరెన్సీ వైద్యుడిగా కొనసాగనున్నారు.