గుంతకల్లు పట్టణంలోని మోదీనాబాదు కాలనీలో కర్నాటక మద్యం టెట్రా ప్యాకెట్లు విక్రయిస్తున్న రామాంజినేయులు అను వ్యక్తిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు ఒకటవ పట్టణ సీఐ రామ సుబ్బయ్య తెలిపారు. మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో తమ సిబ్బందితో దాడులు నిర్వహించి రామాంజినేయులును అదుపులోకి 14 కర్నాటక మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.