కదిరి పట్టణంలోని ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం హంస వాహనంపై దర్శనం ఇచ్చిన శ్రీవారు ఇవాళ సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa