కదిరి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్పీ కుంట మండలం తాటి మానుగుంత గ్రామానికి చెందిన రాజేష్ పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన మాట్లాడుతూ. కదిరి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని తనను గెలిపిస్తే ప్రజల ప్రతినిధిగా నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానన్నారు. తాను ప్రజలకు నాయకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానని అన్నారు.