ఏపిలోని విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. దీనిపై జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీ నారాయణ ట్విటర్ వేదికగా స్పందించారు. విశాఖ పోర్టులో డ్రగ్స్ రవాణా చాలా తీవ్రమైన విషయమని అన్నారు.
డ్రగ్స్ మాఫియా ద్వారా రాష్ట్రంలోని యువత ఏ విధంగా టార్గెట్ చేయబడుతుందో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోందని తెలిపారు. ఈ ఘటన పై విచారణ జరిపించి నిందితులు, వారి వెనకున్న రాజకీయ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.