ఏ సినీ నటుడుకి లేని క్రేజ్ మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఉందని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. శనివారం తిరుపతిలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27 తేదీ నుండి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు.. 2014 గెలిచి చంద్రబాబు ప్రజలు మోసం చేశారు.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా సహా చాలా హామీలు ఇచ్చారు.. చివరికి ఆయనకే శఠగోపం పెట్టారని దుయ్యబట్టారు.. టీడీపీ, జనసేన అభ్యర్థులను అత్యంత పేలవంగా రిలీజ్ చేశారు.. దాంతో మా వాళ్లు గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. ఇక, ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన వాళ్లకి టీడీపీ సీటు ఇవ్వలేదని విమర్శించారు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలే ఉంటాయి అందుకే 24 సీట్లు అని.. అది ఇది అంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ చెప్పారు.. మరి ఇప్పుడు 21 సీట్లకు ఏమీ చెప్పాలో పవన్ కల్యాణ్‌కు త్రివిక్రమ్ రాసి ఇవ్వలేదేమో అంటూ రోజా ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ సైతం టీడీపీ నేతలకే టికెట్ ఇచ్చిందని విమర్శించారు. ప్రజలంతా 175 స్థానాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది మళ్లీ వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి రెడీ ఉన్నారని తెలిపారు.. సిద్ధం సభలకు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆశతో ప్రజలు ఉన్నట్టు మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతీ హామీ వైయస్ జగన్ అమలు చేశారు, తండ్రి తగ్గ తనయుడుగా సీఎం వైయస్ జగన్ పాలన అందించారని ఉద్ఘాటించారు. 2014లో చంద్రబాబు అండ్ మూడు పార్టీలు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి, రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టారని విమర్శించారు. ప్రజల్ని మళ్ళీ మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారు. మేనిఫెస్టోతో సీఎం వైయస్ జగనన్న త్వరలో ప్రజలు ముందుకు రాబోతున్నారని మంత్రి రోజా తెలిపారు.