ఎల్లో మీడియాపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏటిమొగలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నికల ప్రచారంపై ఎల్లో మీడియా అసత్య కథనాలు. తప్పుడు కథనాలను ఎమ్మెల్యే ద్వారంపూడి తీవ్రంగా ఖండించారు. కాకినాడలో ఏ ప్రాంతానికి రమ్మన్నా వస్తాను అంటూ ఈనాడు, ఏబీఎన్, టీవీ-5కి ద్వారంపూడి ఛాలెంజ్ చేశారు. ఆ ప్రాంతంలో ప్రజలు ఏ సమస్య గురించి అడిగినా వారితో మాట్లాడేందుకు సిద్దమని పేర్కొన్నారు. గత ఐదేళ్ళలో ఏటిమొగలో మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా పార్క్‌ను నిర్మించాను, 1800 మందికి ఇళ్ళ స్ధలాలు మంజూరు చేశానని ఎమ్మెల్యే తెలిపారు. నా ఎన్నికల ప్రచారానికి ఏటిమొగ మత్స్యకారులు బ్రహ్మరధం పట్టారని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు.