అధికారం కోసం చంద్రబాబు ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనకాడడని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టే 2019 టీడీపీని ఓడించారని అన్నారు జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని సజ్జల చెప్పారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. చంద్రబాబు అధికారం కోసం పవన్, బీజేపీని వాడుకుంటున్నారు. అధికారం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.