పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలోని 26వ వార్డులో 50 మంది కార్యకర్తలు స్థానిక పార్టీ దళిత విభాగం సీనియర్ నేత ఇంజేటి రవీంద్ర ఆధ్వర్యంలో జనసేన, టీడీపీలను వీడి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. భీమవరం 25వ వార్డుకు చెందిన 100 మంది జనసేన, టీడీపీ నాయకులతో పాటు పట్టణంలోని ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు భారీగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బొమ్మదేవర ముస్లి, కలిశెట్టి శ్రీనివాస్, పోలిశెట్టి సత్యనారాయణ, కర్ర స్వామి, బొమ్మదేవర మందు తదితరులున్నారు. ఉండి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ పీవీఎల్ నర్సింహరాజు, ఉప సర్పంచ్ గొట్టుముక్కల కళ్యాణ్ వర్మ సమక్షంలో 50 మంది వైయస్ఆర్‌సీపీలో చేరారు.