పుట్టపర్తి నియోజకవర్గంలో మళ్లీ ఎగిరేది వైయస్ఆర్‌సీపీ జెండానే అని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పుట్టపర్తి నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. పుట్టపర్తి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గా దూసుకుపోతున్నారు. ప్రతి వీధిలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పేద ప్రజలకు మేలు చేసే జగనన్న ప్రభుత్వం మళ్ళీ వస్తేనే అభివృద్ధి సంక్షేమలు కొనసాగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం జగనన్న 124 సార్లు బటన్ నొక్కారు.. ఒక్కసారి పేదల తలరాత మార్చే ఫ్యాన్ గుర్తుపై మీ బటన్ నొక్కి జగనన్న ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఒక్కరి సంక్షేమం జగనన్న లక్ష్యమని, పేద వర్గాలు బాగుపడాలని ధ్యేయంతో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నది అన్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు పుట్టపర్తి అభివృద్ధిని పట్టించుకోలేదు మీ బిడ్డ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. పుట్టపర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డ శ్రీధర్ రెడ్డి ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.