గూడూరు వైసీపీ టికెట్ మేరుగ మురళీకి అధిష్టానం కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వరప్రసాద్ ఎమ్మెల్యేగా పోటీచేయాల్సిందేనని భావించారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా కాషాయ పార్టీలోకి వరప్రసాద్ చేరిపోయారు. కండువా కప్పిన కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే సిట్టింగ్ సీటు ఇవ్వకపోయినా ఫర్లేదు కానీ.. తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు మాత్రం అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ను వరప్రసాద్ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. 2014 ఎన్నికల్లో ఇదే లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన వరప్రసాద్ 37,425 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గూడురు నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఒకవేళ ఈయనకు సీటు కన్ఫామ్ అయితే.. 2024 ఉప ఎన్నికల్లో పోటీచేసిన కే. రత్నప్రభ పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.