వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అధికార వైసీపీ నేతలు ఉచ్చానీచ్చాలు మరచి, బరితెగించి వ్యవహారిస్తున్నారని, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు, సోషల్ మీడియా వేదికగా ఎక్కువైయ్యాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కొన్ని షోషల్ మీడియా ఛానల్స్‌ను స్వాధీనం చేసుకుని అసహ్యమైన వార్తలు వేస్తున్నారని, తెలంగాణలో యూ ట్యూబ్ ఛానల్స్ కొనుగోలు చేసినా ఫలితాలు వేరుగా వచ్చాయన్నారు. సీఎం జగన్ సొంత సోదరిని వైసీపీ సలహాదారుల సలహాలతో ఇష్టా రీతిగా వేధిస్తున్నారని మండిపడ్డారు. నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు కూడా అలానే వ్యవహారిస్తున్నారన్నారు. ప్రసన్న కుమార్ రెడ్దికి చెల్లెలు వరస అవుతున్న ప్రశాంతి రెడ్దిని అసహ్యంగా ప్రసన్న విమర్శిస్తున్నారని, ఆది దంపతులు అని పూజలు చేసి పొగిడిన నోటితోనే తిడుతున్నారని,. ప్రశాంతి రెడ్ది ప్రత్యేర్థి కావడంతో ప్రసన్నకు ఓటమి భయం కంటి ముందు కనిపిస్తోందని కోటంరెడ్డి అన్నారు. వేమిరెడ్డి రాజకీయాల్లోకి రాక ముందే విద్యా, వైద్యం, తాగు నీరు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వవిహించారన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వైసిపీ వెన్నుపోటు పొడిచిందన్నారు. వైసీపీ వేమిరెడ్డికి.. ఎమ్మెల్యే అభ్యర్థులకు గొడవలు పెట్టి కుట్రలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్, లక్ష్మిపార్వతి పార్టీ, టీడీపి, కాంగ్రెస్, వైసీపీ పార్టీలు మారిన ప్రసన్నది వెన్నుపోటు కాదా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. మరోసారి ప్రసన్న కుమార్ రెడ్ది.. వేమిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దీటుగా సమాధానం చెపుతానన్నారు. కొండపల్లి గురవయ్య లాంటి చాలా మంది వ్యక్తులు ప్రసన్నకి సమాధానం చెబుతారని, ప్రసన్న నాలుగు మాట్లాడితే మేమూ నాలుగు మాట్లాడగలుగుతామన్నారు. వ్యక్తిత్వాలను హరించే విధంగా వ్యవహారిస్తే దీటుగా స్పందిస్తామని, ఏడాది క్రితమే ఫోన్ ట్యాపింగ్ మీద చెప్పానని, ఫోన్ ట్యాపింగ్‌పై టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేపడుతామన్నారు. నిజంగా లక్షల మెజార్టీతో గెలుస్తామన్న నమ్మకం విజయసాయి రెడ్డికి ఉంటే తన నాలుగేళ్ల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.